కరోనా పేషెంట్లకు ఆన్ లైన్ హెల్ప్ లైన్

సేవా భారతి స్వచ్ఛంద సేవా సంస్థ వెల్లడి

corona cases
corona cases

Manchiryala: కరోనా వైరస్‌ సోకి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి ఆపదలో ఆదుకొనేందుకు హెల్ప్‌లైన్‌ అండగా నిలుస్తోంది.

సేవా భారతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని కరోనా పేషెంట్లకు ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్టర్‌ కన్సల్టేషన్‌తోపా టు ఇతర సహాయ సహకారాలు అందజేస్తోంది.

ఇందు కోసం 9676733 230 సెల్‌ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. వైద్యులతో మాట్లాడిస్తూ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర సమాచారాన్ని అందజేస్తున్నారు.

నిరుపేదలైన కరోనా పేషెంట్లకు సంస్థ ఆధ్వర్యంలో ఉచితం గా ఆక్సీ మీటర్, థర్మామీటర్ తో పాటు వైద్యుల సూచనల మేరకు మందుల కిట్లను అందజేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్‌ వెరబెల్లి తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/