సౌదీలో 24 గంట‌ల్లో 1,409 కొత్త కేసులు

మొత్తం కేసుల సంఖ్య 3,01,323

corona virus – Saudi Arabia

రియాద్‌: కరోనా వైరస్‌ ఉద్ధృతి సౌదీ అరేబియాలో కొనసాగుతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో నమోదైన 1,409 కొత్త కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు సౌదీ వ్యాప్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య 3,01,323కు చేరింద‌ని మంగ‌ళ‌వారం ఆరోగ్య‌శాఖ‌ వెల్ల‌డించింది. అలాగే 4,526 మంది ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రిక‌వ‌రీలు 2,72,911 అయ్యాయి. ఇక నిన్న సంభ‌వించిన 34 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 3,470 మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లిగొంది. ప్ర‌స్తుతం దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో 24,942 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 1,716 మంది ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/