ఏపి కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే…

వైఎస్‌ఆర్‌ విద్యా కానుక పథకానికి ఆమోదం

jagan mohan reddy
cm jagan mohan reddy

అమరావతి: సిఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపి కేబినేట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవే..


.నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదముద్ర. 2020 నుంచి 2023 వరకు నూతన పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుంది.
.నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు.
.వైఎస్‌ఆర్ విద్యా కానుక పథకానికి ఆమోదం. వచ్చే నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్న పథకం.
.బీసీ ఫెడరేషన్లు, రామనపాడు పోర్టు డీపీఆర్ కి ఆమోదం.
.వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషకాహార పథకానికి ఆమోదం. ఈ పథకం ద్వారా మహిళలు, శిశువులకు పూర్తి స్థాయిలో పోషకాహారం అందించనున్న ప్రభుత్వం. సెప్టెంబర్ 1న పథకం ప్రారంభం.
.పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్ మెంట్ అధికారుల పోస్టులకు ఆమోదముద్ర.
.సెప్టెంబర్ 11న వైఎస్‌ఆర్ ఆసరా పథకానికి ముహూర్తం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/