అనారోగ్యంపై ఇంకా అలుపెరుగని యుద్ధమే!

దేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు

corona effectL A war on sickness!
corona effectL A war on sickness!

యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలా డిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్యసంస్థ తీవ్ర హెచ్చరికలు చేస్తున్న ప్పటికీ నిజాముద్దీన్‌ తబ్లీగ్‌ జామాత్‌ సమావేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చి నట్టుగా కనిపిస్తుంది.

దీనివల్ల దేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం ప్రజలను తీవ్రంగా కలవర పరుస్తుంది. పాలకులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మెరుగులు దిద్దడం, ప్రజల దృష్టిని మళ్లించడం పరిపాటిగా మారింది.

విద్య,వైద్యం, రెండు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల్లో చైతన్యం,ఆరోగ్య వెల్లివిరుస్తాయి.

అనాదిగా అనేక వ్యాధులు,అంటు వ్యాధులు ప్రబలి ప్రపంచ ఆరోగ్యానికి సవాళ్లు విసురుతున్నా మానవ్ఞడు తన మేధస్సుకు పదును పెడుతూ, శాస్త్రసాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ అనారోగ్యం అలుపెరగని యుద్ధం చేస్తూనే ఉన్నాడు.

నేడు విలాసవంతమైన జీవితం కోసం సంపాదన వెనకాలపడి వేళకు భోజనం చేయక, కుటుంబానికి దూరమై మానసిక ప్రశాంతత కరవై అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్న వారు కొందరు .

రోజంతా కష్టపడి పనిచేసి నా పూట గడవక, సరైన పౌష్టికా హారం లభించక అనారోగ్యాన్ని వంశపారంపర్యగా అనుభవిస్తున్న వారు మరికొందరు.

దేశం అభివృద్ధి చెందడంలో ఆ దేశ ప్రజల ఆరోగ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు పైబడినా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోవడం, వేళ్లూనుకుపోయిన పేదరికాన్ని సమూ లంగా నిర్మూలించలేకపోవడానికి కారణం పాలకుల స్వార్థపూరిత విధానాలే అనేది జగమెరిగిన సత్యం.

అందుకే మనది యువ భారతమని పొంగిపోకుండా ఆరోగ్యభారతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు.

ఈ రెండింటిని ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పుకుంటూ ప్రజల హక్కును కాలరాస్తున్నాయనే సత్యా న్ని కాదనగలమా!

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం పేదల ఆరోగ్యానికి కొంత భరోసా ఇస్తున్నప్పటికీ కార్పొరేట్‌ ఆస్పత్రుల గళ్లపెట్టెలు నింపడానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నదనే విమ ర్శలు వినవస్తున్నాయి.

కావలసినన్ని సదుపాయాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కల్పిస్తే, అవసరానికి తగ్గట్టుగా కొత్త ఆస్పత్రులను నిర్మిస్తే ఈ వృధా ఖర్చునుండి బయటపడవచ్చనేది మేధావ్ఞల అభిప్రాయం.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన సందర్భంగా భిక్షగాళ్లు కనబడకుండా గోడను నిర్మించడం చూ స్తుంటే నెరిసిన నెత్తికి నల్లరంగు రుద్దుకున్నట్లే అనిపించక మానదు.

యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలా డిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్యసంస్థ తీవ్ర హెచ్చరికలు చేస్తున్న ప్పటికీ నిజాముద్దీన్‌ తబ్లీగ్‌ జామాత్‌ సమావేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చి నట్టుగా కనిపిస్తుంది.

దీనివల్ల దేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం ప్రజలను తీవ్రంగా కలవర పరుస్తుంది. పాలకులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మెరుగులు దిద్దడం, ప్రజల దృష్టిని మళ్లించడం పరిపాటిగా మారింది.

విద్య,వైద్యం, రెండు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల్లో చైతన్యం,ఆరోగ్య వెల్లివిరుస్తాయి.

అనాదిగా అనేక వ్యాధులు,అంటు వ్యాధులు ప్రబలి ప్రపంచ ఆరోగ్యానికి సవాళ్లు విసురుతున్నా మానవ్ఞడు తన మేధస్సుకు పదును పెడుతూ, శాస్త్రసాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ అనారోగ్యం అలుపెరగని యుద్ధం చేస్తూనే ఉన్నాడు.

ప్రజలు వివిధ రోగాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షిత మంచినీటి సరఫరా, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకర అంశాలపై సమన్వ యం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో 1948ఏప్రిల్‌ 7న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు అయింది. దీని ప్రధాన కార్యాల యం స్విట్జర్లాండ్‌లోని జెనివాలో ఉంది.

ఇందులో 196 సభ్య దేశాలున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరిం చుకొని 1950 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం అనారోగ్యానికి దారితీసే ప్రధాన అంశంపై పరిశోధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ఈ ఏడు 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్నవేళ కరోనా వైరస్‌ విజృంభి స్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా 203 దేశాలలో కొవిడ్‌-19పంజా విసిరి ముచ్చెమటలు పట్టిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా దీని ధాటికి విలవిల్లా డిపోతూ సాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో క్యూబా తన స్నేహహస్తాని అందిస్తూ అనేక దేశాలకు తమ డాక్టర్లను పంపించి సేవలందిస్తుండడం అభినందించదగ్గ విషయం.

క్యూబాలో ప్రతి వెయ్యి మందికి 8.2 మంది డాక్టర్లు ఉండడం చూస్తుంటే ఆ దేశం ప్రజారోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. ఇది చూస్తుంటే వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు సేవా దృక్పథాన్ని కనబరిచే ఆరోగ్యకరమైన వాతావరణం దేశాలు, రాష్ట్రాల మధ్య ఉండాలని అనిపించక మానదు.

ఈ విషయంలో క్యూబా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. మనిషి కేవలం శారీరకంగానే గాక మానసికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆరోగ్యానికి నిర్వచనాన్ని ఇచ్చింది.

‘పంట నుండి పళ్లెం సురక్షిత ఆహారం అనే నినాదాన్ని ప్రజలకు తమ ఆరోగ్యం పట్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కలుషిత వాతావరణం పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది.

మనం తినే ఆహారం కల్తీ కావడం వల్ల, పరిశుభ్రం గా లేని నీటిని తాగడం వల్ల మనకు దాదాపు 200 రకాల రోగా లు వస్తున్నాయి.విరేచనాలతో ఏటా ప్రపంచంలో 22 లక్షల మంది చనిపోతున్నారు.వాళ్లలో పసిపిల్లలు ఎక్కువని డబ్ల్యుహెచ్‌ఓ చెప్పిం ది.

కాన్పుకు ముందు, తర్వాత తగిన సంరక్షణ, వైద్యసదుపాయా లు లేక ప్రపంచంలో రోజుకు 800మంది మహిళలు చనిపోతున్నారు.

ఈ రేటు పేద దేశాల్లో మరింత అధికం. సకాలంలో తల్లిపాలు, తక్కువ ధరకు లభించే టీకాలు ఇవ్వక ఏటా ప్రపంచ వ్యాప్తంగా 66లక్షల మంది చిన్నారులు ఐదేళ్లలోపు చనిపోతున్నా రు.

ధూమపానం, మద్యపానం నిషేధించకపోగా , ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్‌ పెట్టెలపై, మద్యం సీసాలపై హెచ్చరికలు రాసి ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకోవడం చూస్తుంటే పాల కులకు ప్రజారోగ్యంపై ఎంత శ్రద్ధ ఉందో తేటతెల్లం అవుతుంది.

ఇదిలా ఉండగా పోగాకును నమలడం, పొగ తాగడం, పరోక్ష ధూమపానం విషయంలో తగిన చర్యలు తీసుకోకుంటే 2030కి ఏటా పొగాకు వల్ల చనిపోయే వారి సంఖ్య 30లక్షలకు చేరుతుం దని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రపంచంలో ప్రతి10 మరణాల్లో ముగ్గురు హృద్రోగాల వల్ల అందులో గుండెపోటు, స్ట్రోక్‌ వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు.

మధుమేహం వల్ల హృద్రోగాలు, స్ట్రోక్‌ వచ్చి చనిపోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తుందనే విషయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్న కరోనా వైరస్‌ విజృంభనను ఆత్మవిశ్వాసం తో ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉంది.

అదే సమయంలో ప్రజలు ఈ వైరస్‌ బారినపడకుండా రక్షణ చర్యలు చేపడుతూ ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది.

సామాజిక మాధ్యమాలలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది.

కొవిడ్‌-19 బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యసిబ్బంది కూడా వైరస్‌ బారినపడుతున్న వేళ వారికి తగినన్ని పిపిఇ కిట్లను, మాస్కులను సమకూర్చి వారి నిస్వార్థ సేవలకు తోడుగా నిలవాల్సి న అవసరం ఉంది.

అదే సమయంలో ప్రజలు కూడా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రతే పరమాయుధంగా బాధ్యతతో మెలుగుతూ అప్రమత్తంగా ఉండాల్సినఅవసరం ఎంతై నాఉంది.జ్వరం, పొడిదగ్గు, తుమ్ములు లాంటి లక్షణాలు కనబడితే వెంటనే 104ను సంప్రదించి ఇతరులకు వ్యాధి సోకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

కరోనా వైరస్‌కు ముందను, వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నవేళ అతి త్వరలోనే ఆ ప్రయత్నాలు ఫలవంతమై ఆ మహమ్మారిని తరిమికొట్టి, ప్రజారోగ్యం పరిఢవిల్లాలని ఆశిద్దాం.

-గుండు కరుణాకర్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/