భారత్‌లో ఐదు వేలు దాటిన కరోనా కేసులు

నిన్న ఒక్క రోజే 773 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 773 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 5,194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 149 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ బారినుండి ఇప్పటి వరకు 401 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 4,643 మంది ఆసుత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1,018 కేసులు నమోదు అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/