ప్రజావాక్కు

స్థానిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి:–ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి నిరుద్యోగులు ప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగనియామకాలపై కోటిఆశలు పెట్టుకున్నారు. గ్రామసచివాలయం వ్యవస్థ కార ణంగా కొంతనిరుద్యోగ సమస్యతగ్గింది.

అయితేవివిధ ప్రభుత్వ శాఖలలో రెండున్నర లక్షలకుపైగా ఖాళీగా వ్ఞన్న పోస్టులను, భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గత జులై నెలలో ప్రకటించారు.

కాని ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరం.

రాష్ట్రంలోని ప్రభుత్వప్రాథమిక,ఉన్నత పాఠశాలలో 25వేలకు పైచిలుకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం వెంటనే డిఎస్సీ, గ్రూప్‌ 1,2,3 పోస్టుల నియామకం నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి.

30శాతం భక్తులను మాత్రమే అనుమతించాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

తెలుగు రాష్ట్రాలలో పలువ్ఞరు అర్చకులు, దేవాలయ సిబ్బంది కరోనాబారిన పడుతున్నారు.కేంద్రప్రభుత్వం నిర్దేశించిన జాగ్ర త్తలను అమలు చేయనందునే ఈ పరిస్థితి వచ్చిందన్నది నిర్వి వాదాంశం.

తిరుపతి, శ్రీశైలం,రాజన్న ఆలయంతోపాటు పలు ఆలయాలుఇటీవలమూతపడ్డాయి.ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి దేవాలయాల్లో రక్షణ,భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలి. పెద్దసంఖ్యలో భక్తులు వస్తున్నందున ఈ కరోనా వ్యాప్తి వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

సాధారణ పరిస్థితులలో కంటే 30శాతంభక్తులనుమాత్రమే భౌతికదూరం పాటిస్తూఅనుమతించడం,శానిటైజేషన్‌, మాస్కులు తప్పనిసరి చేయడం,ధర్మల్‌ స్క్రీనింగ్‌ వంటి చర్యలు తప్పనిసరి చేయాలి.

కరోనా టీకాలో సామర్థ్యమెంత?: -సింగంపల్లి శేషసాయి కుమార్‌, రాజంపేట

కరోనా మొత్తం ప్రపంచాన్ని భయంతో గజగజలాడించింది. మానవ జాతి మొత్తం ఎప్పుడెప్పుడు దీనికి టీకా వస్తుందా అని ఎదురుచూస్తున్న సమయంలో రష్యా మొదటి కరోనా వైరస్‌ టీకా విడుదల చేసింది.

దీనితో మొత్తం ప్రపంచం ఒక్క సారిగా ఊపిరిపీల్చుకుంది. కానీ ఇప్పుడే అందరిలోనూ ఒక చిన్న అనుమానం కలుగుతోంది. టీకా పరీక్షలు వాటి ప్రయోగ ఫలితాలపై కొంత అయోమయంగానే ఉంది.

ఎందుకంటే ప్రయోగ సమయంలో టీకా కోసం వచ్చిన వాలంటరీలకు టీకా ఇచ్చి వారిని ఐసోలేషన్‌లో ఉంచారా? లేక కరోనా లక్షణాలు గల వారి వద్దకు పంపి ప్రయోగాలు సరిచూసారా? అన్నదే కొంత తెలుసుకోవాలని ఉత్తేజాన్ని రేకెత్తిస్తోంది.

రష్యా వ్యాక్సిన్‌పై సందేహాలెన్నో:-డా.డి.వి.జి శంకరావు పార్వతీపురం

కరోనా వ్యాక్సిన్‌ విజయవంతంగా అభివృద్ధిచేశామంటూ, దాని కి స్పుత్నిక్‌5గా నామకరణం చేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆడంబరంగా ప్రకటించారు.

ఆశాజనకమైన వార్తే. కానీ ఎగిరి గంతేయాల్సిన వార్తమాత్రంకాదు.ఎందుకంటే ఆటీకాపై భరోసా నింపేరుజువులేవీ వారుచూపించలేదు.

చెప్పిందల్లా తన కూతురు కూడా ఈ టీకా తీసుకుందని, అది తనలో కరోనా రోగనిరోధక యాంటిబాడిస్‌ని గణనీయంగా పెంచిందని,ఇప్పుడామె ఆరో గ్యంగా ఉందని, సాక్షాత్తు దేశానికి అధ్యక్షుడు తన కూతురుపై ధైర్యంగా పరీక్ష నిర్వహించేందుకు అనుమతించడం గొప్ప విషయం.

కానీ అంతకుమించి వైజ్ఞానికంగా విశేషంలేదు. ఆరోగ్య వంతురాలైన కూతురు అయితే ఫేజ్‌1, కరోనా వచ్చాక టీకా ఇచ్చిఉంటే ఫేజ్‌2.అంతే.

మిగతాట్రయల్స్‌వేటిపై,వాటి వ్యవధిపై ప్రభావంఉండదు. కొత్త మందు సమర్థత, సురక్షితత్వం అన్నవి రుజువులపై ఆధారపడి ఉంటాయి.కానీ నమ్మకాల మీద కాదు.

చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలి:-ఇమ్మడి నాగేశ్‌,సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌ యాదాద్రిజిల్లా

కరోనా ప్రవేశానికి కాస్త ముందు నుండే రాష్ట్రంలో చేనేత కార్మి కుల వృత్తికి తీవ్ర సంక్షోభం ఏర్పడినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించకపోవడం సిగ్గుచేటుగా ఉంది. ఈ మధ్య కేంద్రప్రభుత్వం కేంద్ర చేనేత మండలిని రద్దు చేసింది.

ఈ నెల 7న తూతూ మంత్రంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరి పినా ఈ కరవ్ఞకాలంలో పస్తులు, అప్పులతో విలవిల్లాడుతున్న చేనేత కార్మికులకు ప్రభుత్వాలు ప్రత్యేక సహాయమేదీ చేయ కపోవడం శోచనీయం.

చేనేత సంఘాలను నిర్వీర్యం చేయడం దురదృష్టకరం. పైగా మగ్గాలను ఆధునీకరించుకోండని నీతులు చెప్తున్నారు. ప్రతి ప్రభుత్వ అవసరాలకు చేనేత ఉత్పత్తులనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలి.

మానవ రవాణాను నిరోధించాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా కేసులు ఎక్కువగా పెరిగిపో తున్నాయి.అదృశ్యమైన కేసులు ప్రతిపోలీసుస్టేషన్‌లో నమోదు అవుతున్నాయి.

కానీ ఈ కేసులలో ఎలాంటి పురోగతి కనబడక పోవడంపై సామాన్య ప్రజలు విస్మయం చెందుతున్నారు.

ఇలా అదృశ్యమైన కేసులపై పోలీసుశాఖ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టా ల్సిన అవసరం ఉంది. మానవ అక్రమ రవాణా కేసుల నిరో ధానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి.

నిందితులకు కఠిన శిక్షలు అమలు అయ్యేలా ప్రభుత్వం చూడాలి.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/