లాక్‌డౌన్‌ సమయంలో కూడా పెరిగిన ధమానీ సంపద

బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడి

radha kishan dhamani
radha kishan dhamani

ముంబయి: భారత దేశంలో లాక్‌డౌన్‌ విదించడంతో దేశంలోని కుబేరుల సంపద భారీగా హరించుకుపోయింది. కాని డీమార్ట్‌ అధనేత రాధాకిషన్‌ ధమాని సంపద మాత్రం 5 శాతం పెరిగి 10.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రస్తుతం సంసన్నుల సంపద తరిగిపోతున్న ఈ సమయంలో ఈయన సంపద పెరగడం గమనార్హం. కాగా ఇతని మార్ట్స్‌ షేర్‌ వాల్యూ 18 శాతం పెరిగినట్లు బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తెలిపింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-prade