హేతుబద్ధీకరణతో తగ్గుతున్న ఉపాధ్యాయ పోస్టులు

విద్యాప్రమాణాలు తగ్గే అవకాశం

Teacher-File
Teacher-File

ఆంగ్ల మాధ్యమం అందించడానికి గత ప్రభుత్వం అప్పట్లోనే ఆదర్శపాఠశాలలను ప్రారంభించింది.

బోధనలో, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో ఆదర్శంగా ఉండేలా వీటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సత్ఫలితాలు వచ్చాయి.

ప్రభుత్వం ప్రస్తుతం వాటిలో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం తగదని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడం ద్వారా ఆయా స్కూళ్లలో విద్యాప్రమాణాలు తగ్గే అవకాశం ఉంది. వాటిల్లో ఉన్న ఇంగ్లీషు మీడియం వల్ల, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నందున తమ పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని తల్లిదండ్రులు చేర్చారు.

ఇప్పుడు ఆయా స్కూళ్లలో పోస్టులు తగ్గించడం ద్వారా మళ్లీ ఆయా స్కూళ్లలో విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లవైపు అడుగులు వేయడం జరగవచ్చు.

కాబట్టి ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను పాత విధానం మాదిరిగానే తరగతికి ఒక ఉపాధ్యాయున్ని కొనసాగించాలి.

ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చాలా కాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ మొదలవ్వగా దీనిలో భాగంగా పదోన్నతులు పూర్తి చేసి హేతు బద్ధీకరణ మొదలు పెట్టింది.

అనంతరం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ప్రకటించింది.

అయితే ప్రస్తుత బదిలీల్లో హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలల్లో పోస్టులు బదిలీ అవ్ఞతుండగా, మరికొన్ని పాఠశాలల్లో కొత్త పోస్టులు మంజూరు అవుతున్నాయి. ఈ ప్రక్రియ అంతా నవంబరు మూడు నాటికి చైల్డ్‌ ఇన్ఫోలో నమో దైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేయడం జరుగుతున్నది.

ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం చేపట్టిన విద్యాభివృద్ధి కార్యక్రమా లతో భారీ స్థాయిలో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లల్లో చేరారు.

అయితే చైల్డ్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌ సరిగ్గా పనిచేయకపోవడం, విద్యా ర్థుల సమాచారాన్ని సరైన సమయంలో సేకరించలేకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు సకాలంలో చైల్డ్‌ ఇన్ఫో పూర్తి చేయలేకపోయారు. పెరిగిన విద్యార్థులు చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు కాకపోవడంతో చాలా చోట్ల పోస్టులు పోతున్నాయి.

క్షేత్రస్థాయిలో విద్యార్థుల సంఖ్యను మండల విద్యాశాఖ అధికారులు పరిశీలించి ఉపాధ్యాయ పోస్టులు సరిచేసే అవకాశం లేకపోవడం, కేవలం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని జిల్లా, రాష్ట్ర అధికారులు చేయడంతో చాలా చోట్ల ఉపాధ్యాయ పోస్టులు పోతున్నాయి.

వీటిని క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారాన్ని పక్కాగా సేకరించి విద్యాశాఖ అధికారులు సరిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2015లో ఏర్పాటు చేసిన ఆదర్శప్రాథమిక పాఠశాలల్లో మాత్రం పోస్టులు తగ్గుతున్నాయి. దీనికి కారణం హేతుబద్ధీకరణకు రూపొందించిన నియమాలేనని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 2015లో ఆదర్శప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. మండలానికి కనీసం రెండు ఆదర్శపాఠశాలలు తగ్గకుండా ఏర్పాటయ్యాయి.

మొదట్లో 120 మందికిపైగా విద్యార్థులు నమోదు ఉంటే, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించినప్పటికీ 2017లో జరిగిన హేతుబద్ధీకరణలోనూ ఆదర్శపాఠశాలల్లో 80 మంది విద్యార్థుల నమోదు ఉన్నప్పటికీ ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకున్నారు.

దీంతో ఆదర్శ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక్కో ఉపాధ్యాయుడు ఉండే వారు.

ఆయా పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టి సత్ఫ లితాలు పొందుతున్నారు.

ప్రస్తుతం అదే విధానాన్ని కొనసాగిస్తారని భావించినప్పటికీ ఆదర్శపాఠశాలలకు కూడా మిగతా ప్రాథమిక పాఠశాలల విధానమే వర్తింప చేస్తుండటం వల్ల ప్రస్తుత హేతుబద్ధీకరణ ప్రక్రియ వల్ల భారీస్థాయిలో ఆదర్శప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు తగ్గుతున్నాయి.

ఆయా పాఠశాలల్లో 80 మందికి ఐదుగురు ఉపాధ్యాయులు అవసరం కాగా, నూతన విధానంలో ఒక పి.ఎస్‌.హెచ్‌.ఎం, రెండు ఎస్జీటి ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే కేటాయించనున్నారు. దీనివల్ల మరో రెండు పోస్టులు రద్దు కానున్నాయి.

ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడంతో సంఖ్య తగిస్తే ఇక ఏదో ఒక మాధ్యమం మాత్రమే అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనుకున్న విద్యా లక్ష్యాలు అమలవ్వాలంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.

అందుకే ఉమ్మడి బడి విధానం అమలు చేస్తే ప్రతి ఒక్క తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలతో పాఠశాలల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ఆదర్శపాఠశాలల్లో కనీసం ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటేనే సాధిస్తున్న సత్ఫలితాలు కొనసాగుతాయి.

ఆంగ్ల మాధ్యమం అందించడానికి గత ప్రభుత్వం అప్పట్లోనే ఆదర్శపాఠశాలలను ప్రారంభించింది. బోధనలో, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో ఆదర్శంగా ఉండేలా వీటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సత్ఫలితాలు వచ్చాయి.

ప్రభుత్వం ప్రస్తుతం వాటిలో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం తగదని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడం ద్వారా ఆయా స్కూళ్లలో విద్యాప్రమాణాలు తగ్గే అవకాశం ఉంది.

వాటిల్లో ఉన్న ఇంగ్లీషు మీడియం వల్ల, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నందున తమ పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని తల్లిదండ్రులు చేర్చారు.

ఇప్పుడు ఆయా స్కూళ్లలో పోస్టులు తగ్గించడం ద్వారా మళ్లీ ఆయా స్కూళ్లలోవిద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లవైపు అడుగులు వేయడం జరగవచ్చు.

కాబట్టి ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను పాత విధానం మాదిరిగానే తరగతికి ఒక ఉపాధ్యాయున్ని కొనసాగించాలి.

  • వాసిలి సురేష్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/