విపక్షం లేకుంటే శూన్యత ఏర్పడుతుందా?

పరిశీలకుల అంచనా!

Bihar Assembly
Bihar Assembly

బీహార్‌ ఎన్నికల తరువాత దేశంలో బిజెపికి కనుచూపు మేరలో తిరుగులేదని భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో కళ్లు తెలేయడంతో, దేశం లో ప్రతిపక్షమేలేనిరాజకీయశూన్యం ఏర్పడబోతుందా అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్‌ నాయకులలో పార్టీ నాయకత్వం తీరుపై అనేక మంది సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తు న్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని అనేక మంది యువనాయకులతో, సీనియర్లకు పొసగడం లేదని, రాహుల్‌గాంధీ, ప్రియాంకల తీరు పట్ల కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తన బలాన్ని అంచనావేయడంలో అతిగా ప్రవర్తించ డంతోనే 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లను గెలిచి, పరోక్షంగా ఎన్డీయే గెలుపునకు కారణమైందనే విమర్శలు ఉన్నాయి. బిజెపి వ్యూహా త్మకంగా హిందూఓటర్లను తనవైపునకు తిప్పుకోవడంలో విజయ వంతం అవుతుంది.

అదీకాకుండా గత ఆరుసంవత్సరాలలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన పథకాలతో, పేద,మధ్యతరగతి లోని కొంత మందికి నేరుగా నగదు ప్రోత్సాహకాలను అందిం చడంతో కూడా బిజెపి పట్ల కొంత సానుకూలత వస్తుంది.

ఉత్తర భారతంలో బిజెపి పాలిత రాష్ట్రాలతోపాటు ఇతరరాష్ట్రాలలో కూడా పేదలకు మరుగుదొడ్ల నిర్మాణానికి, సొంత ఇంటిని నిర్మించుకోవ డానికి ఇస్తున్న లక్షాయాభైవేల ఆర్థిక సహాయం కూడా ఎంతో ప్రభావితంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే సమయం లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ కానీ, ఇతర స్థానిక పార్టీలు కానీ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. జాతీయ అంశాలను లేవనెట్టడంలో కానీ, స్థానిక సమస్యల విషయంలో కూడా ప్రతిపక్షాలు అధికారంలోని పార్టీకి దీటుగా స్పందించడంలో విఫలం అవ్ఞతున్నారు.

వందయేళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకొనే కాంగ్రెస్‌ పార్టీలో జాతీయస్థాయిలో కానీ, రాష్ట్రాల్లో కానీ సమర్థవంతంగా నాయకత్వం వహించగలవారు లేకపోవడం,అరవై, డెబ్బై ఏళ్లు పైబడిన వారే ఇంకా పార్టీ నాయ కత్వం కావాలని ఆశించడంతో, యువనాయకులకు అంతగా రుచించడం లేదు.

అందులో భాగంగానే,పెద్దల తీరునచ్చని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో యువనాయకులు తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్‌లో సమస్య సద్దుమణిగినా, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 15 నెలలోనే అధికారం కోల్పోవడం జరిగింది.

కాంగ్రెస్‌ పార్టీ దేశంలోని రెండు,మూడు రాష్ట్రాలలో తప్ప ఎక్కడ కూడా ఒంటరిగా పోటీ చేసే స్థితిలో లేదు.కర్ణాటకలోతప్ప మరే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఉనికే కరవవ్ఞతుంది.ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నా, జిల్లాల్లో నాయకులంతా అధికార పార్టీ వైసిపి, టిఆర్‌ఎస్‌వైపే చూస్తున్నారు.

తెలంగాణలో బిజెపి కొంత బలం పుంజుకోవడానికి కూడా కాంగ్రెస్‌ నాయకుల ఒంటెద్దుపోకడలే కారణం అని భావిస్తున్నారు. ప్రతి రెండు,మూడు నెలలకొక సారి పార్టీ నాయకత్వాన్ని మరుస్తున్నారు. దీంతో రాష్ట్రనాయకత్వాన్ని ఎదిరించే వారిని నియంత్రించడంలో అధినాయకత్వం విఫలం కావడం కూడా కార్యకర్తల మనోధైర్యాన్ని నీరుగారుస్తుంది.

రాహుల్‌గాంధీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన తర్వాత మళ్లీ అనారోగ్యంతో ఉన్నసోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నా పార్టీని బలోపేతం చేయడంలో విఫలం అయ్యారనే ప్రచా రం జోరుగా సాగుతుంది.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జరిగిన తిరుగుబాటుకు ప్రధాన కారణం సీనియర్‌నాయకుల తీరే కారణ మని విమర్శిస్తూ తిరుగుబాటు చేసిన మాధవరావ్ఞ సింది యా, రాజేష్‌పైలెట్‌ల ఆరోపణలకు ఇప్పటికీ కాంగ్రెస్‌ అధినాయకత్వం జవాబు చెప్పలేకపోయింది.

మొన్నటి బీహార్‌ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీని అన్నివేళలలో కంటికి రెప్పలా చూసుకొనే నాయ కుల్లో ఒకరైన కపిల్‌సిబాల్‌ కూడా బహిరంగ విమర్శలు చేశారు. గతంలో 23 మంది సీనియర్‌ నాయకులు అధినాయ కత్వానికి రాసిన లేఖ బహిరంగంకావడం టీకప్పులోని తుఫానులా సద్దు మణిగినా,మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుంది.

అంతా సద్దుమణిగిందని భావిస్తున్నా, లోన ఉన్న ఆలోచనల వైరుధ్యాలను, అసంతృప్తిని కానీ పరిష్కరించే దిశలో కాంగ్రెస్‌ నాయకత్వం ప్రయత్నించకపో వడంతో, ఇక కాంగ్రెస్‌ చరిత్ర ముగిసినట్లేనా అని పరిశీలకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి తమ రాష్ట్రాలలో ఏమాత్రం బలం లేకున్నా,రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఇంకా కాంగ్రెస్‌ పార్టీతో జట్టుకట్టడానికి ప్రధాన కారణం. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న సుప్రీం కోర్టు న్యాయవాదుల సహాయం, వారికి కావాల్సిరావడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

ఎందుకంటే అధికారంలో ఉన్న రాష్ట్రా లలో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి వేసే ఎత్తులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేసే చట్టాలు చేసినసమయంలో వాటికి కావాల్సిన న్యాయసహాయాన్ని కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దలే అందించాల్సివస్తుంది.

రెండేళ్ల క్రితం కర్ణాటకలో అక్రమమార్గంలో అక్కడి గవర్నర్‌ బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడుకానీ, మొన్న మహారాష్ట్రలో బిజెపిని కాదని కాంగ్రెస్‌, ఎన్సీపిలతో పొత్తుగట్టిన శివసేనకు అండగాఉండి,మూడు రోజుల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో ప్రధాన పాత్ర వహించినవారు కాంగ్రెస్‌లోని ప్రముఖ నాయకులు,సుప్రీం కోర్టులోనిన్యాయవాదులే అన్న విషయం అందరికీ తెలిసినదే.

కపిల్‌ సిబాల్‌, అభిషేక్‌ సింఘ్వీ లాంటి అనేకమంది ప్రముఖ న్యాయవాదులు ఇంకా కాంగ్రెస్‌పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు అవసరం అయినప్పుడు కూడా కోర్టులో ఆదుకొనేది వీరే.

మధ్య ప్రదేశ్‌లో 28మంది కాంగ్రెస్‌నాయకులు పార్టీని వీడినా, వారందరి శాసనసభాస్థానాలకు రాజీనామా చేయించడంలో బిజెపిపై ఒత్తిడి తేగలిగింది వీరే. అలాగే రాజస్థాన్‌ లో సచిన్‌పైలెట్‌ తిరుగుబాటు ను అడ్డుకోవడంలో సుప్రీంకోర్టులోబలంగా వాదించి,అక్కడకాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలిపింది కూడా ఈ న్యాయవాదులే.

కోర్టులను నమ్ము కొని మాత్రమే రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకోలేవని అనేకరాష్ట్రాలలో ఎన్నికలు నిరూపించాయి.

దేశమంతా హిందువ్ఞల ఓట్లతోనే దేశాన్ని పాలించగలమని నమ్ముతున్నా బిజెపిని అడ్డుకో వడానికి కాంగ్రెస్‌ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని ఈ ఆరేళ్ల కాలంలోని ఎన్నికలునిరూపించాయి.

గత 70 సంవత్సరాలలో ఇతర అవకాశాలు లేకపోవడంతోనే మైనార్టీలు కాంగ్రెస్‌తో జత కట్టారు. కానీ కాంగ్రెస్‌తో ప్రేమతోకాదు. ఇన్నాళ్లు మైనార్టీ నాయ కులమని చెప్పుకొని, పార్టీలు పెట్టిన మైనార్టీలను కూడా వారు నమ్మలేదు.

కానీ బిజెపి హిందూ ఓటర్లను మాత్రమే ఏకీకృతం చేసే ప్రయత్నాలు ప్రారంభించిన తరువాత మైనార్టీల ఆలోచనల లో మార్పులు వచ్చాయనిచెప్పుకోవాలి.

ఉత్తరప్రదేశ్‌లోసమాజ్‌వాది, బహుజన సమాజ్‌ పార్టీలతో జతకట్టిన మైనార్టీలు ఇప్పుడు వారిని వీడిపోయారు.అలాగే కాంగ్రెస్‌, ఆర్జేడీలతో ఉన్న మైనార్టీలు కూడా వారిని నమ్మే పరిస్థితిలో లేరని గతఎన్నికలు రుజువు చేశాయి.

సీట్లు ఎన్ని గెలుచుకొన్నారనే విషయాన్ని పక్కనపెట్టి ఆలోచిస్తే, మైనార్టీముస్లింలు, మెజార్టీ హిందువుల పార్టీగా మాత్రమే ఉన్న బిజెపికి వ్యతిరేకంగా, ప్రస్తుతం ఉన్న సంప్రదాయ పార్టీలను కాదని,తామే సొంత నాయకులను, పార్టీలను తయారు చేసుకో వాలనే దిశలో ప్రయత్నాలు ప్రారంభించాయని చెప్పుకోవచ్చు.

అంతకు ముందు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఎంఐఎం పోటీ చేసి తన స్థానాన్ని పటిష్టం చేసుకొంటుంది. ఇక మిగిలింది రేపటి బెంగాల్‌, తమిళనాడు, ఎన్నికల్లో కూడా పోటీచేసి తన ఉనికిని చాటుకోవడానికి మైనార్టీ నాయకులు కూడా ఏకీకృతం అవుతున్నా రు.

దళితులు, మైనార్టీల పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ ఇకముందు అలా ఉండలేదు. ఎందుకంటే దళితులలో చాలా వర్గాలు, మైనార్టీలు ఇతర పార్టీలలో చేరిపోయారు. కమ్యూనిస్టులు కూడా కార్యకర్తలు లేని పార్టీగా మిగిలిపోయింది.

ఒకరకంగా దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఏక పార్టీ దిశగా రాజకీయాలు వెలుతున్న దశలో జాతీయ, సెక్యులర్‌ భావాలను సమభాగా లలో నింపుకొని, పేద, మధ్యతరగతినే కాకుండా కొత్తగా ఏర్పడుతున్న ఉన్నత మధ్యతరగతి ప్రజల మనసులో స్థానం గెలువగల సత్తా రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టగల జాతీయ నాయకుని కోసం దేశం ఎదురుచూస్తుంది.

  • సిహెచ్‌.వి ప్రభాకర్‌రావు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/