అండమాన్‌కూ తాకిన మర్కజ్‌ సెగ

9 మందిలో కరోనా లక్షణాలు

corona virus
corona virus

పోర్ట్‌బ్లేయిర్‌: ప్రస్తుతం దేశంలో.. మర్కజ్‌లో నిర్వహించిన మత పరమయిన కార్యాక్రమం గురించి చర్చ నడుస్తుంది. ఈ కార్యాక్రమానికి సుమారు 8 వేల మంది వరకు హజరయినట్లు తెలుస్తుంది. కాగా ఈ మర్కజ్‌ కార్యాక్రమానికి అండమాన్‌ నుంచి కూడా పలువురు హజరయ్యారు. తాజాగా అక్కడ 9 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. వారు మర్కజ్‌ కు వెళ్లివచ్చినట్లు తెలిపారు. కాగా వీరందరూ ఢిల్లీ నుంచి వేరువేరు విమానాల్లో ప్రయాణించి అండమాన్‌ చేరుకున్నారు.దీంతో అండమాన్‌లో కరోనా కేసుల సంఖ్య 10 కి చేరుకుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/