ఈరోజు, రేపు తెలంగాణ లో భారీ వర్షాలు

రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయన్న వాతావరణ కేంద్రం

హైదరాబాద్ : ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని… దాని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని… మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది.

రాష్ట్రంలో రుతుపవనాల కదలిక చురుకుగానే ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల కారణంగా ఈ నెలలో పూర్తి స్థాయి వర్షపాతం నమోదు కానుందని చెప్పింది. సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. నిన్న కూడా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా దాదాపు అన్ని రిజర్వాయర్లలో నీటిమట్టం పెరుగుతోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/