కరోనా బారినపడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత రెండు, ‌మూడు రోజులుగా కోవిడ్ 19 స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కవిత.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో గత వారం రోజులుగా తనను‌ కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కొన్ని రోజుల పాటు తాను హోం ‌ఐసోలేషన్ లో ఉండనున్నట్లు తెలిపారు.

దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 5,221 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,975 మంది కరోనా నుంచి కోలుకోగా… 15 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 47,176 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,45,05,801కి చేరుకుంది. వీరిలో 4,39,25,239 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,28,165 మంది మరణించారు.