మహనీయునికి ఘోరమైన అవమానం
అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన ఘనత తెలంగాణ సర్కారుదేనని విహెచ్ ఆగ్రహం

హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని రాసిన మహనీయునికి ఘోరమైన అవమానం జరిగిందని, దేశమంతా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ, అంబేద్కర్ విగ్రహం పోలీసు స్టేషన్ లో పడివుండటం తనను కలచి వేసిందని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన ఘనత తెలంగాణ సర్కారుకు మిగిలిందని ఎద్దేవా చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఫిబ్రవరి 1లోగా అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడి నుంచీ అయితే తెచ్చారో, ఆ చోటుకే చేర్చి ప్రతిష్ఠ చేయాలని లేకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అంబేద్కర్ కు తీరని అవమానం జరిగినా, ఏ నాయకుడూ మాట్లాడటంలేదని ఆవేదన వ్యక్తం చేసిన వీహెచ్, విగ్రహ ప్రతిష్ఠాపన కోసం తన ప్రాణాలను అర్పించేందుకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/