కరోనాసురుని విశ్వ విహారం!
వార్తల్లోని వ్యక్తి (ప్రతి శనివారం)

ఇదెక్కడి కరోనా సురుడు? పూర్వపు మన పురాణాలలోని రాక్షసులను మించిపోయాడు? ఈ కరోనా వైరస్ ఇప్పుడు యావత్ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది! ఎప్పుడు ఎవరికి సోకుతుందో! ఎవరిని కబళిస్తుందో!
వైరస్ అంటే చకచకా ఒకరి నుంచి మరొకరికి చకచకా పాకేది! వైరస్ అనేది మానవాళి మధ్య ఎప్పుడూ సహజీవనం చేస్తున్నది! ఒకవార్త ‘వైరస్ అయిదంటారు.
అంటే, వేగంగా మరొకరికి పాకిందని అర్థం. లోగడ వ్యాధులు ప్రాంతాలకే పరిమితమయ్యేవి. మశూచికం, కలరా, ప్లేగు మొదలైనవి. ఈమధ్య ఎబోలా, స్వైన్‌ప్లూ, డెంగ్యూ ఇలాంటివి ప్రాంతీయంగా వ్యాపించేవి చైనా సృష్టి?
కరోనా అలా కాదే
మొదట చైనాలోని పూహాన్‌లో ప్రారంభమైంది. అయితే, ‘చైనా బయోలాజికల్ ఆయుధంగా దీన్ని అవసరమైనప్పుడు తన ‘శత్రుదేశంపై ప్రయోగించడానికి సిద్ధం చేసిందని ప్రతీతి.
అయితే, మొదట దానికే బెడిసి కొట్టింది. ముందు వ్యూహాన్‌లోనే బెడిసికొట్టి, మొదట మూడువేలమందిని బలిగొన్నది. అక్కడ తగ్గిపోయి, ఇతర దేశాలపైనా దాడిచేసింది.
ఔను, మరి గురితప్పిన బాణం ఎటు వెడుతుందో, ఎవరిని కబళిస్తుందో ఎవరికెరుక? ఇప్పుడు మళ్లీ వూహాన్ నగరంలో కరోనా తిరిగి మోసులు వేస్తున్నదట!
ఏమిలాభం! కరోనా సురుడు ఎంతమందిని బలిగొన్నాడు? అమెరికాలో ఇప్పటికిప్పుడు దాదాపు 30లక్షలమందికిపైగా సోకి, ఇప్పటికి వేలమందిని బలిగొన్నది.
ఇక, స్పెయిన్‌లోయితే, ఆ దేశపురాణినే బలిగొన్నది. ఇంగ్లాండ్‌లో ఆ దేశపు ప్రధానమంత్రికే సోకి, ఆయన చావ్ఞతప్పి కన్నులొట్టపోయి, మొన్ననే బయట పడ్డాడు. ఆ దేశపు ఆరోగ్యమంత్రికి కూడా ఈ అనారోగ్యం తప్పలేదు.
రాజయితేనేమి, యువరాజైతేనేమి కరోనాకు లెక్కా? బ్రిటిష్ యువరాజే చార్లెస్‌ను కూడా కబళించాలని చూసింది. అయితే ఆయన బయటపడ్డారు.
దాదాపు కోటిమందిని బలిగిన్న స్పానిష్ ప్లూ!
స్పానిస్‌ప్లూ పేరు చాలామంది విని వ్ఞండరు. దాదాపు వంద సంవత్సరాల నాడు ఆ మహామ్మారి దాదాపు కోటి మందిని బలిగొన్నది.
అయితే, అదృష్టవశాత్తు, ప్రధాని మోడీ ముందుగా మేల్కొని, లాక్‌డౌన్ ప్రకటించి, దేశాన్ని అప్రమత్తం చేయడం వల్ల భారతదేశంలో ఈ వ్యాసం రాసే సమయానికి దాదాపు 12వేల మందికి కరోనాసోకి, నాలుగు వందలమందిని మాత్రమే బలిగొన్న ది.ఇది ఏ దేశంలో జరిగిన మృతుల సంఖ్యతో పోల్చినా తక్కువే.
వలంటీర్ల వ్యవస్థ
కాగా, కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా ముందుగా మేల్కొని, వూరూరా వలంటీర్ల వ్యవస్థను నెలకొల్పి, ఏదో రూపంలో వారిని ఇంటింటికీ పంపి, గ్రామీణ ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
అంతేకాదు పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, పారిశుద్ధ సిబ్బంది మొదలైన వర్గాలుచిత్తశుద్ధితో ఈ విపత్కర సమయంలో ప్రజలకు యధాశక్తిని సేవ చేస్తున్నందుకు వారిని అభినందించాలి.
- డాక్టర్ తుర్లపాటి కుటుంబ రావు, (”పద్మశ్రీ అవార్డు గ్రహీత)
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/