లక్షణాలు లేకుండానే కరోనా కేసులు

నమోదు అయిన కేసులలో సుమారు 80శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు: ఉద్దవ్‌

uddav thackeray
uddav thackeray

ముంబయి: మహారాష్ట్రలో నమోదయిన కరోనా కేసులలో 80 శాతం ఎలాంటి లక్షణాలు లేకుండా నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే అన్నారు. మిగిలిన 20 శాతం కేసులలో కొంతమందికే కరోనా లక్షణాలు కనిపించాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడం చాలా సునితత్వంతో కూడుకున్నదని.. రానున్న మూడు, నాలుగు నెలలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. వైద్యులు తమ క్లినిక్‌లు నడుపుకోవడంతో పాటు డయాలసిస్‌ సెంటర్‌లు కూడా నడుపుకోవచ్చని తెలిపారు. ఇలాంటి సమయంలో లాక్‌ఢౌన్‌ను సడలిస్తే ముంబయిలో జన సంచారం ఎక్కువ అయి కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. కరోనా తీవ్రత అధికం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల చివరి వరకు ఓ నిర్ణయానికి వస్తామని ఉద్దవ్‌ తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/