నిరాడంబరంగా పార్టీ ఆవిర్బావ వేడుకలు

రేపు టిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్బావ దినోత్సవం

kcr
kcr

హైదరాబాద్‌: రేపు తెలంగాణ పార్టి ఆవిర్బవించిన రోజు సందర్బంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్బవించి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి ఆరు సంవత్సరాలు అవుతుంది. ఈ ఆరు సంవత్సరాలో ప్రభుత్వం అనేక అధ్బుతాలు చూపించిందని అన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి దృష్ట్యా పార్టీ ఆవిర్బావ వేడుకలను నిరాడంరంగా నిర్వహించుకోవాలని కెసిఆర్‌ సూచించారు. ఈ సారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తమ ప్రాంతాల్లోనే నిరాడంబరంగా జెండా ఎగురవేయాలని చప్పారు. కాగా రేపు ఉదయం తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను సిఎం కెసిఆర్‌ ఎగురవేయనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/