కరోనాను పరీక్షించేందుకు ఢిల్లీ ఐఐటీ నూతన విధానం

ఆమోదించిన ఐసీఎంఆర్

IIT Delhi
IIT Delhi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పెరుగుతున్న నేపథ్యలో మానవ శరీరంలో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకునే సులువైన, తక్కువ ఖర్చుతో కూడిన విధానాన్ని ఢిల్లీ ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) అభివృద్ధి చేయగా, దానికి ఐసీఎంఆర్ నుంచి అనుమతి లభించింది. రియల్ టైమ్ పీసీఆర్ ఆధారిత రోగ నిర్దారణలో ఓ విద్యా సంస్థ తయారు చేసిన పరికరానికి ఐసీఎంఆర్ ఆమోదం లభించడం ఇదే తొలిసారి. ఈ కిట్ల ద్వారా 100 శాతం ఫలితాలు వస్తున్నాయని నిర్దారించిన తరువాతనే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇక ఈ విధానం ఇప్పటివరకూ అమలులో ఉన్న టెస్టింగ్ ప్రక్రియలకు అయ్యే వ్యయాన్ని కూడా తగ్గిస్తుందని ఢిల్లీ ఐఐటీ పరిశోధకులు వెల్లడించారు. కాగా చైనా నుంచి దిగుమతి అయిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వాడకాన్ని నిలిపివేసిన తరుణంలో ఢిల్లీ ఐఐటీ తయారు చేసిన కిట్లకు అనుమతి లభించడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/