ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు చేరువలో కరోనా కేసులు

1.26 లక్షల మరణాలు

corona virus
corona virus

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇరవై లక్షలకు చేరువయ్యాయి. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1.26 లక్షలకు చేరుకుంది. అమెరికాలో కరోనా భారిన పడిన వారి సంఖ్య ఆరు లక్షలు దాటింది. మరణాలు 26వేలకుపైగా నమోదు అయ్యాయి. కరోనా బారిన అతలాకుతలం అయిన ఇటలీలో ఇప్పటివరకు 21 వేలకు పైగా మరణాలు సంభవించాయి. స్పెయిన్‌లో 18,255 మంది మరణించారు. రష్యాలో నిన్న ఒక్కరోజలే 2500 పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 170 మంది మరణించారు. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచదేశాలు గడగడలాడుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా కొంత నెమ్మదించినప్పటికి రష్యాలో కేసులు అధికమవుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/