భారత్‌లో భారీగా కరోనా కేసుల నమోదు
ఒక్కరోజులోనే 1,076 కొత్త కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఒక్కరోజు వ్యవధిలోనే 1,076 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. దేశం మొత్తంలో కరోనా సోకిన వారి సంఖ్య 11,439 కు చేరింది. ఇందులో 1,305 మంది ఈ వైరస్ బారినుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 377 కు చేరింది, గడిచిన 24 గంటలలో 38 మంది మరణించినట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,687 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 178 మంది ప్రాణాలు కోల్పోయారు. డిల్లీ, తమిళనాడులో కేసుల సంఖ్య బారీగా పెరగగా..తాజాగా రాజస్థాన్‌లో కరోనా కేసుల 1000 కి చేరువయ్యాయి. ఇక్కడ 969 మందికి కరోనా సోకగా 147 మంది మరణించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/