నాగ చైతన్య ఫ్యాన్స్ ఫై సమంత ఫైర్

అక్కినేని నాగ చైతన్య అభిమానుల ఫై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగ చైతన్య – సమంతలు ప్రస్తుతం విడాకులు తీసుకొని ఎవరికీ వారు జీవిస్తున్నారు. తెలుగు , హిందీ సినిమాలతో ఇద్దరు బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో గత కొద్దీ రోజులుగా నాగ చైతన్య మళ్లీ ప్రేమలో పడ్డాడని, హీరోయిన్‌ శోభితా ధూళిపాలతో డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వార్తలను నాగచైతన్య ఫ్యాన్స్‌ తిప్పి కొడుతూ..‘చై ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడానికే సమంత పీర్‌ఆర్‌ టీమ్‌ ఇలాంటి రూమర్స్‌ సృష్టిస్తోంది’అని ట్వీట్స్‌ చేస్తూ వస్తున్నారు. ఈ ట్వీట్స్ ఫై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిలపై పుకార్లు వస్తే నిజమే కానీ అబ్బాయిలపై వస్తే మాత్రం అమ్మాయిలే చేయించారని ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు.

‘అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే. అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయిస్తోందంటారు. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మీరు ప్రస్తావించిన వ్యక్తులు ముందుకెళ్లిపోతున్నారు. మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ పని మీద, మీ కుటుంబాల విషయాల మీద ఏకాగ్రత పెట్టండి’అని సమంత ట్వీట్‌ చేశారు. మరి దీనిపై ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’, లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ‘దూత’అనే వెబ్‌ సిరీస్‌ కూడా త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఇక సమంత విషయానికొస్తే.. ఇటీవల కేఆర్‌కే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన యశోదా, శాకుంతలం చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉండగా..విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ చేస్తుంది. ఈ మూవీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.