అగ్రరాజ్యంలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

26 వేలకు పైగా మరణాలు

corona virus
corona virus

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే ఇక్కడ 24,895 కరోనా కేసుల నమోదు అయ్యాయి. అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 6.14 లక్షలకు చేరింది. కాని కరోనా మరణాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకు దేశంలో 26 వేల మందికి పైగా కరోనా కారణంగా మరణించారు. దేశంలో తాము తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన న్యూయార్క్‌లో కరోనా నెమ్మదించటం ఊరట కలిగించే అంశం అని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/