అదుపులోకి వస్తున్న కరోనా

రెండు రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం

covid vaccination -file
Decreasing corona cases in the country- covid vaccination -file

New Delhi: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల నుంచి మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్‌ ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 7,61,737 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 3,116 మందికి మందికి వైరస్ సోకినట్లు తెలిపారు. శనివారం మరో 47 మంది మహమ్మారి తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 5,15,850 మంది కరోనా తో మృతి చెందారు. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/