దేశంపై పంజా విసురుతున్న కరోనా

24 గంటల్లో  93,249 పాజిటివ్ కేసులు

Corona boom in the country
Corona boom in the country

New Dellhi: దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్తగా దాదాపు లక్ష మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో  93,249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. శనివారం కరోనాతో 513 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం మరణాల సంఖ్య 1,64,623కు పెరిగింది. ఇప్పటివరకు 1,16,29,289 మంది కరోనాను జయించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 7,59,79,651 డోసుల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/