కరోనాను పిచ్చకొట్టుడు కొట్టనున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ ఓ లాయర్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే కరోనా కాలం కావడంతో థియేటర్ల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారా అనే సందేహం పలువురిలో నెలకొంది. అసలే పవన్ కళ్యాణ్ చిత్రం కావడంతో ప్రేక్షకులు పెద్దగా ఒకేచోట గుమికూడకుండా ఉండేలా థియేటర్ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇవేమీ లెక్కచేయకుండా పవన్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. కరోనా, గిరోనా జాన్తా నై అనే రీతిలో పవన్ సినిమాను చూసేందుకు అందరూ రెడీ అవుతున్నారు.

ఏదేమైనా కరోనాను భయపెట్టే విధంగా ప్రేక్షకులు ఈ సినిమాకు రానున్నారని, దీంతో ఈ సినిమా పాత రికార్డులను బద్దలుకొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ శృతి హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు నివేధా థామస్, అంజలి, అనన్యా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.