చంద్రబాబు హెలికాప్టర్ కు ఏటీసీతో సమన్వయ లోపం

వెంటనే వెనక్కి మళ్లిన హెలికాప్టర్

Coordination error with ATC for Chandrababu helicopter

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు విశాఖ నుంచి అరకు వెళుతుండగా కలకలం రేగింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. చంద్రబాబు హెలికాప్టర్ కు ఏటీసీతో సమన్వయ లోపం తలెత్తింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పిన విషయాన్ని గుర్తించిన ఏటీసీ వెంటనే పైలెట్ ను అప్రమత్తం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలో హెలికాప్టర్ వెళ్లడం లేదని, రాంగ్ రూట్లో వెళుతోందని ఏటీసీ చంద్రబాబు హెలికాప్టర్ పైలెట్ కు వివరించింది. ఏటీసీ హెచ్చరికలతో చంద్రబాబు హెలికాప్టర్ వెంటనే వెనుదిరిగింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతించడంతో చంద్రబాబు సురక్షితంగా అరకు చేరుకున్నారు.

కాగా, నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం గుడివాడలో సభ జరుగగా శనివారం అరకులో పార్లమెంటర్ నియోజకవర్గంలో సభను నిర్వహించారు. ఈ సభకు హాజరయ్యే క్రమంలో విశాఖ నుంచి అరకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఈఘటన తలెత్తింది.