సాయి పల్లవి ఫై కేసు నమోదు..

ఫిదా తో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి.. ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ప్రస్తుతం ఈ భామ విరాట పర్వం మూవీ తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రానా హీరోగా నటించగా , వేణు డైరెక్ట్ చేసాడు. సురేష్ ప్రొడక్షన్ నిర్మించింది. ప్రస్తుతం ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్లో ఈమె మాట్లాడిన కొన్న వ్యాఖ్యలు ఈమెను వివాదంలోకి నెట్టాయి. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
ఈ క్రమంలో భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, న్యాయ సలహా తీసుకున్న మీదట సాయిపల్లవిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు భజరంగ్ దళ్ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, సాయిపల్లవి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ దుమారం రేగుతోంది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి ఆమె వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు.
అసలు సాయి పల్లవి ఏమన్నదంటే.. ”కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా. వాళ్లు అందులో కాశ్మీర్ పండిట్లను ఎలా చంపారు అని చూపించారు. మనం వాటిని మత సంఘర్షణలా చూస్తున్నాము. రీసెంట్‌గా ఒక బండిలో ఆవుని తీసుకెళ్తున్నారు. అందులో డ్రైవర్ ముస్లిం అతను ఉన్నాడు. కొంత మంది అతన్ని కొట్టేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది. మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే, ఇతరులను బాధించకుండా ఉంటే, లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మంచిగానే ఉంటుంది” అని తెలిపింది.