మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్ భారీ వర్షాల ధాటికి పంటలు పాడైపోయిన ప్రాంతాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం, గుండిమెడలో దెబ్బతిన్న పసుపు, మినుము పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంట పొలాల రైతులకు అన్ని విధాలా అండగా ఉంటానని లోకేశ్ రైతులకు భరోసా ఇచ్చారని టిడిపి ప్రకటించింది. ఆయనతో టిడిపి మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈ విషయంపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మంగళగిరి నియోజకవర్గంలోని గుండిమెడ, చిర్రావూరు, పెదకొండూరు గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించాను’ అని ఆయన చెబుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/