తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు

తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు అందించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 9 దాటితే భానుడు భగభగమంటున్నాడు. ఇంట్లో నుండి కాలు బయటపెట్టాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం లేదా సాయంత్రమే ఏ పని ఉన్న చేసుకుంటున్నారు. ఇక ఈ ఎండలకు భూగర్భంలో నీటి చుక్క లేకుండా పోతుంది. ఇలాంటి ఈ సమయంలో వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు అందించింది.

రాగల రెండు రోజుల్లో తెలంగాణాలో ఎండలు తగ్గుతాయని, ఆకాశం మేఘావృతం అవుతుందని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం మాత్రం ఖమ్మం, నల్గగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట్‌, గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.