రుచి : క్యాలీ ఫ్లవర్ -65

వంటల ప్రత్యేకం: ‘చెలి’ మహిళలకు

Variety of recipes- Cauliflower-65
Variety of recipes- Cauliflower-65

కావలసినవి:

క్యాలీ ఫ్లవర్ 1, కరివేపాకు 3రెక్కలు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు , బియ్యం పిండి 1 టేబుల్ స్పూను, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, మిరప కారం 2 టీ స్పూను, గరం మసాలా ఒక టీ స్పూను, ఉప్పు -తగినంత. పసుపు -పావు టీ స్పూను , అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్లు, నూనె వేయించటానికి తగినంత .


తయారు చేసే విధానం:

ఒక పాత్రలో మైదా పిండి , బియ్యంపిండి కార్న్ ఫ్లోర్ , మిరప కార్మ, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద చేసి కొద్దిగా నీరు పోసి కలపాలి,. క్యాలీ ఫ్లవర్ ను శుభ్రం చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లా విడదీయాలి. ఒక పాత్రలో నీరు, పసుపు , కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద ఉంచి కొద్దిగా వేడయ్యాక , విడదీసిన క్యాలీ ఫ్లవర్ ను అందులో వేసి కొద్ది సేపు ఉడికించి తీసేసి, కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని జతచేయాలి. స్టవ్ మీద బాండీ లో నూనె కాగాక కొద్దీ కొద్దిగా తీసుకుంటూ నూనెలో వేసి బాగా వేగాక, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. కరివేపాకుతో అలంకరించి వేడివేడిగా సర్వ్ చేయాలి.. అన్నం, చపాతీలోకి మాత్రమే కాదు, స్నాక్ లా తిన్న కూకా బాగా రుచిగా ఉంటుంది.

నాడి (ఆరోగ్యం ) వ్యాసాలకు : https://www.vaartha.com/specials/health1/