పనస కాయ బిర్యానీ

రుచి: వెరైటీ వంటకాలు

Pineapple Biryani
Pineapple Biryani

కావలసిన పదార్థాలు:

పచ్చి పనసకాయ ముక్కలు – అరకేజి, బాస్మతి బియ్యం- అరకేజి
ఉల్లిపాయలు- పెద్దవి 2, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టేబుల్‌ స్పూను
పుదీనా తరుగు – ఒక కప్పు, బియ్యానీ మసాలా పొడి- ఒక టేబుల్‌ స్పూను
కారం – అరటీ స్పూను, కొత్తిమీర తరుగు – ఒక కప్పు, నూనె -4 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి- 2 టేబుల్‌ స్పూన్లు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, దాల్చిన చెక్క, బియ్యానీ ఆకు- మసాల కోసం
ఉప్పు – రుచికి సరిపడా, పచ్చిమిర్చి తరుగు -పావ్ఞకప్పు
పెరుగు – అరకప్పు

తయారుచేసే విధానం:

ముందుగా బాస్మతి బియ్యం 70 శాతం ఉడికించి నీటి వంచేసి ఆరబెట్టాలి. పనస ముక్కల్లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి తగినంత నీరు పోసి 50శాతం కుక్కర్లో ఉడికించాలి. కడాయిలో నూనె వేసి సన్నగా, పొడుగ్గా తరిగిన ఉల్లి దోరగా వేగించి వేరుగా ఉండాలి.

అదే కడాయిలో నెయ్యి వేసి మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పనస ముక్కలు, పుదీనా తరుగు, పెరుగు బియ్యాన్నీ మసాలా పొడి, ఉప్పు, సగం వేగిన వెల్లిల్లి తరుగు, కారం ఒకటి తర్వాత ఒకటి వేగిస్తూ కలపాలి. 5 నిమిషాల తర్వాత ముక్కలపైన ఉడికించిన అన్నం పేర్చాలి.

ఆపైన మళ్లీ మిగిలిన ఉల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు చల్లి మూతపెట్టి చిన్నమంటపై 15 నిమిషాలు మగ్గించాలి. తర్వాత పనస ముక్కలు అన్నం కలిపి వడ్డించుకోవాలి.

బ్రింజాల్‌ రోల్స్‌

కావలసిన పదార్థాలు
వంకాయలు-4 పెద్దవి, ఉల్లికాడ ముక్కలు -2 టేబుల్‌ స్పూన్లు
టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు- పావ్ఞకప్పు చొప్పున (గార్నిష్‌కి అదనంగా)
కొత్తిమీర తరుగు-1 టేబుల్‌స్పూన్లు బీట్‌రూట్‌ తురుము -పావ్ఞ కప్పు
బియ్యం రవ్వ- ముప్పావ్ఞ కప్పు (ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఆలివ్‌ నూనె-2 టేబుల్‌ స్పూన్లు
నూనె-డీప్‌ ప్రైకి సరిపడా, జీలకర్ర పొడి- అరటీ స్పూను
వేరశనగల పొడి-పావ్ఞ కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి)
ఉప్పు- తగినంత

తయారు చేసే విధానం
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండున్న గరిటెల నెయ్యి వేసుకుని వేడి కాగానే ఉల్లిపాయల ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, బీట్‌రూమ్‌ తురుము, టమాటా ముక్కలు, పుదీనాతరుగు, కొత్తిమీర తరుగు, వేరుశనగల పొడి, జీలకర్ర పొడి, విరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి.

ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆలివ్‌, నూనె, నిమ్మరసం వేసుకుని బాగా తిప్పుతూ ఉండాలి. చివరగా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

తర్వాత వంకాయలను పొడవ్ఞగా (థిన్‌ స్లైస్లఆ) కట్‌ చేసుకుని, నూనెలో డీప్‌ ప్రై చేసుకుని, అందులో కొద్దికొద్దిగా ఉల్లికాడల మిశ్రమాన్ని ఉంచుతూ రోల్‌లా చుట్టూకోవాలి. ఊడిపోకుండా సన్నని పుల్ల అడ్డంగా గుచ్చుకుని తినేటప్పుడు ఆపుల్లని తొలగించుకోవచ్చు.

వీటిని కొత్తిమీర తరుగు, టమాటా ముక్కలతో లేదా ఇష్టమైన డ్రైఫ్రూట్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/