కీరతో కళ్లకు మెరుపు

అందమే ఆనందం

ఒత్తిడి, నిద్రలేమి , హార్మోన్స్ అసమతుల్యత వంటి సమస్యలెన్నో కళ్ల కింద నల్లటి వల ఏర్పడేలా చేస్తాయి.. ఇలాంటప్పుడు మీ కళ్ల ను మెరిపించే కొన్ని చిట్కాలు..

టీ స్పూన్ టమాటో , కీర దోస రసంలో చెంచా నిమ్మ రసం , కొద్దిగా తేనె కలిపి కళ్ల కింద రాసుకోవాలి.. ఇలా రోజూ చేస్తే క్రమంగా సమస్య దూరమవుతుంది..

సమపాళ్లలో కీర బంగాళాదుంప రసం తీసుకుని అందులో కాసిన్ని పాలు , తేనే కలపండి.. అందులో దూదిని ముంచి రోజూ మూడు నాలుగు సార్లు కంటి చుట్టూ మృదువుగా రుద్దండి.. ఇలా ఓ వారం చేస్తే ఫలితం ఉంటుంది..

చెంచా తులసి ఆకు ముద్దకు కాసిన్ని పాలు, కీర రసం కలిపి కళ్ల కింద రాస్తే నలుపుదనం తగ్గుతుంది.. గులాబీ రేకల ముద్దకు చెంచా తేనె , తెల్ల సోన చేర్చి ప్యాక్ లా చేస్తే చాలు. మంచి ఫలితం ఉంటుంది.

‘నాడి’ (ఆరోగ్య సంబంధిత సలహాలు) కోసం : https://www.vaartha.com/specials/health1/