ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేందుకే ఇళ్ల పట్టాలు

ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy
  • అక్కచెల్లెమ్మల ముఖాలలో ఆనందం విరజల్లాలి
  • మేనిఫెస్టోలో చెప్పిన ఇళ్లు 25 లక్షలుఇస్తున్నవి 31 లక్షలు

శ్రీకాళహస్తి : రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సమస్యలు కాదు సంతోషాలతో ఆనందోత్సహాల మధ్య ఉండేలా ప్రతి అక్కచెల్లెమ్మల ముఖాలలో సంతోషం విరాజిల్లేలా చేసేందుకే పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతోందని ముఖ్య మంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

సోమవారం చిత్తూరు జిల్లా పర్యటలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలకు ముఖ్య మంత్రి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని గొప్ప కార్యక్రమమైన పేదలందరికి ఇళ్ళు అందించేందుకు శ్రీకారం చుట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి విడతలో 15.65 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు.

చిత్తూరు జిల్లాలో 2.50లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి విడతలో 178840 ఇళ్లనిర్మాణం చేపట్టడం జరుగుతున్నదన్నారు. ప్రస్తుతం శ్రీకా ళహస్తిలో అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేస్తున్న భూమికి మంచి మార్కెట్‌ విలువకలదని, అధికారంలోకి వచ్చిన 18నెలల్లో ఆర్థిక, సామా జిక రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రతిపథకం అమలు చేస్తున్నామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/