కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తుంది: ప్రియాంక గాంధీ

Congress will restore old pension scheme if voted to power in Himachal: Priyanka Gandhi Vadra

సోలన్ః ఈరోజు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని సోల‌న్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ప‌రివ‌ర్త‌న్ ప్రతిజ్ఞా ర్యాలీలో పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఆమె న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని బిజెపి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బిజెపిని న‌మ్ముకుంటే ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచింద‌ని ఆరోపించారు. ఇక‌నైనా బిజెపిని న‌మ్మ‌వ‌ద్ద‌ని, మీరు మీ భ‌విష్య‌త్తు గురించి ఆలోచించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

విశ్రాంత ఉద్యోగుల‌కు పెన్ష‌న్‌లు ఇచ్చేందుకు కేంద్రం ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోయినా, త‌న‌కు అనుకూలురైన బ‌డా వ్యాపారుల‌కు మాత్రం కోట్ల‌ల్లో రుణ మాఫీ చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. బిజెపి స‌ర్కారు యువ‌త‌, ఉద్యోగులు, మ‌హిళ‌ల కోసం చేసిందేమీ లేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం నియామ‌కాలు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో గ‌త ఐదేండ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌న్నారు. ఈసారి కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. మొద‌టి క్యాబినెట్ స‌మావేశంలోనే రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని ప్రియాంక హామీ ఇచ్చారు. వాటిలో మొద‌టిది ల‌క్ష ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న కాగా, రెండోది పాత పెన్ష‌న్ స్కీమ్ అమ‌లు అని చెప్పారు. ఈ ఉద‌య‌మే ఎన్నికల ప్ర‌చారం ప్రారంభించ‌డం కోసం సోల‌న్‌కు వ‌చ్చిన ప్రియాంకాగాంధీ.. మా షూలినీ ఆల‌య సంద‌ర్శ‌న‌ అనంత‌రం స‌భ‌కు హాజ‌ర‌య్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/