ఒక‌వేళ పుతిన్ మ‌హిళ అయి ఉంటే ఉక్రెయిన్‌పై యుద్ధం ఉండేది కాదు

boris johnson
boris johnson

బెర్లిన్‌: బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ రష్యా అధ్యక్షుడి పై కీలక వాక్యాలు చేశారు. ఒక‌వేళ పుతిన్ మ‌హిళ అయి ఉంటే, అప్పుడు ఉక్రెయిన్‌పై అత‌ను యుద్ధం చేసేవాడు కాదు జాన్స‌న్ అన్నారు. ఒక‌వేళ పుతిన్ ఆడ‌దై ఉంటే, నిజానికి కాదు అనుకోండి, కానీ ఒక‌వేళ అయి ఉంటే, బ‌హుశా అత‌ను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లి ఉండేవాడు కాదు అని బ్రిట‌న్ ప్ర‌ధాని తెలిపారు. ఉక్రెయిన్‌పై ఆక్ర‌మ‌ణ‌కు వెళ్ల‌డం అంటే అది విష‌పూరిత‌మైన మ‌గ‌బుద్ధి అని బోరిస్ అన్నారు.

అమ్మాయిల‌కు ఉత్త‌మ చ‌దువును అందించాల‌ని కోరుకున్నారు. శ‌క్తివంత‌మైన స్థానాల్లో మ‌హిళ‌లు అధిక సంఖ్య‌లో ఉండాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం ఆగాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని, కానీ ప్ర‌స్థుత ప‌రిస్థితుల్లో ఆ సంకేతం అంద‌డం లేద‌ని, ఎందుకంటే పుతిన్ ఎటువంటి శాంతి హ‌స్తాన్ని అందించ‌డంలేద‌ని బోరిస్ తెలిపారు. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అంశంలో ప‌శ్చిమ దేశాలు వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన స్థానంలో ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/