తుంగతుర్తి టికెట్ ఆశించి భంగ పడ్డ అద్దంకి దయాకర్

టి కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ ను గురువారం రాత్రి విడుదల చేసింది. ఐదు స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ప్రకటన తో పాటు పఠాన్ చెరువు కు సంబదించిన అభ్యర్థిని మార్చేసింది. అలాగే సూర్యాపేట , తుంగతుర్తి స్థానాలకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆశబాహులకు షాక్ ఇచ్చింది అధిష్టానం.

ముఖ్యంగా తుంగతుర్తి టికెట్ కోసం అద్దంకి దయాకర్ ఎంతగానో ఎదురుచూసారు. ఆ టికెట్ తనకే అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కానీ అధిష్టానం మాత్రం అద్దంకి దయాకర్ ను కాదని ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు కేటాయించారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. శామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా, రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తామన్నారు. తనకు టికెట్ కేటాయించలేదని పార్టీ శ్రేణులు బాధపడవద్దని కోరారు అద్దంకి దయాకర్.