3 రాష్ట్రాలు ఇచ్చినా బీజేపీ ఎందుకు గెలవలేదు :పొన్నాల

తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ గెలవలేకపోయిందన్న ప్రధాని వ్యాఖ్యలకు పొన్నాల కౌంటర్


హైదరాబాద్: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై నిప్పులు చెరగడం తెలిసిందే. ప్రజలు ఎన్నిసార్లు ఓడించినా కాంగ్రెస్ కు అహంకారం తగ్గలేదని, తెలంగాణ ఇచ్చినా సరే ప్రజలు ఆ పార్టీని ఓడించారని మోడీ వ్యాఖ్యానించారు.

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య దీటుగా స్పందించారు. గతంలో బీజేపీ మూడు ప్రత్యేక రాష్ట్రాలను ఇచ్చిందని, అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎందుకు గెలవలేదని పొన్నాల ప్రశ్నించారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదన్న అంశాన్ని ప్రధాని మోడీ గుర్తించాలని హితవు పలికారు. ఏదేమైనా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంగీకరించారని పొన్నాల పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, అంతటి మహోన్నత పార్టీని టుక్డే టుక్డే పార్టీ అనడం సరికాదన్నారు. అయినా మోడీ పాలనలో ఏం ఒరిగిందని పొన్నాల నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేశారే తప్ప సామాన్యులు ఏంచేశారన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/