ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Congress

ఏపీ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు సంబదించిన తమ రెండో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు ఈ జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విడుదల చేశారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

రెండో జాబితా అభ్యర్థుల లిస్ట్ చూస్తే..

ఎంపీ అభ్యర్థులు వీరే..

నరసరావుపేట- సుధాకర్‌
నెల్లూరు- కొప్పుల రాజు
తిరుపతి- చింతామోహన్‌
విశాఖ- పి.సత్యనారాయణరెడ్డి
ఏలూరు- లావణ్య
అనకాపల్లి- వెంకటేష్‌

ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

టెక్కలి- కిల్లి కృపారాణి
భిమిలి- వెంకటవర్మరాజు
విశాఖ సౌత్‌- సంతోష్‌
గాజువాక- రామారావు
అరకు- గంగాధర స్వామి
నర్సీపట్నం- శ్రీరామమూర్తి
గోపాలపురం- మార్టిన్‌ లూథర్‌
యర్రగొండుపాలెం- అజితారావు
పర్చూరు- శివశ్రీలక్ష్మిజ్యోతి
సంతనూతలపాడు- విజేష్‌రాజ్‌ పాలపర్తి
జి.నెల్లూరు౦- రమేష్‌బాబు
పూతలపట్టు- ఎం.ఎస్‌.బాబు