టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన ఆడియో లీక్..

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మెయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈ వ్యవహారం నడుస్తుండగా..పోలీసులు అక్కడికి చేరుకోవడం , ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజ్ లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాగా గురువారం రాత్రి ఏసీబీ కోర్ట్ ఈ వ్యవహారం సరైన ఆధారాలు లేవని ఆ ముగ్గుర్ని విడుదల చేయాలనీ ఆదేశించింది. దీంతో షాక్ లో పడ్డారు.

ఇదిలా ఉండగా..తాజాగా కొనుగోలు వ్యవహారానికి సంబదించిన ఓ ఆడియో బయటకు వచ్చింది.ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి స్వామి, నందకుమార్‌లు మాట్లాడిన ఆడియో కాల్ బయటకు బయటకు వచ్చి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ఆడియో కాల్‌లో ఏముందంటే.. మునుగోడు ఉపఎన్నికలు జరుగుతున్న క్రమంలో మనం ఇక్కడ కలుసుకోవడం సరికాదని, హైదరాబాద్ మంచి ప్లేస్ అని రోహిత్ రెడ్డి చెప్పగా.. నవంబర్ 25 తర్వాత తాను హైదరాబాద్‌కు వస్తానని, ఆ రోజు కూర్చోని ఫైనల్ సెటిల్‌మెంట్ చేసుకుందామంటూ రామచంద్ర భారతి స్వామిజీ చెప్పినట్లు ఆడియో కాల్‌లో ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈడీ నుంచి ఐటీ వరకు తాము చూసుకుంటామని, భద్రత పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ రోహిత్ రెడ్డికి స్వామిజీ హామీ ఇచ్చారు. ఇంకా ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వస్తారంటూ స్వామిజీ చెప్పినట్లు ఉంది.

ముగ్గురు ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్దంగా ఉన్నారని, కానీ ఆ ఎమ్మెల్యేల పేర్లను తాను బయటపెట్టనంటూ రోహిత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నందూ మీద తాము ఒత్తిడి పెట్టామని, అందుకే అతను రోజూ మీకు కాల్ చేస్తున్నారంటూ స్వామిజీ చెప్పినట్లు ఆడియోలో ఉంది. గత కొంతకాలంగా నందూ నిద్రపోవడం లేదని, ఈ పనిలో ఉన్నారంటూ స్వామిజీ తెలిపారు. మరి ఈ ఆడియో ఫై ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూడాలి.