రాహుల్‌ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న మల్లికార్జున్ ఖర్గే

Congress Presidential Candidate Mallikarjun Kharge Joins Rahul Gandhi During Bharat Jodo Yatra

బళ్లారిః రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. బళ్లారి జిల్లాలోని హలాకుంది గ్రామంలో 38వ రోజు ఈ యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ కూడా ఉన్నారు. సెప్టెంబర్ 7, 2022న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇవాళ్టికి వెయ్యి కిలోమీటర్లకు చేరుకోనుంది. బళ్లారిలో బహిరంగ సభ తరువాత ఈ యాత్ర తిరిగి ఏపీలోకి ప్రవేశిస్తుంది. అయితే నిన్న దాదాపు12 కిలోమీటర్లు ఏపీలో యాత్ర చేశారు. మళ్లీ సాయంత్రం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలోకి రాహుల్ జోడో యాత్ర ప్రవేశించింది.

ఇక ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్ గాంధీ యాత్ర ప్రవేశించనుంది. 23న హాఫ్ డే మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తారు. 24, 25న పాదయాత్రకు బ్రేక్ ఉంటుంది. 26 నుంచి రాహుల్ యాత్ర తిరిగి కొనసాగుతుంది. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. మొత్తం 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి మక్తల్‌లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఆ తర్వాత హైదరాబాద్ మీదుగా మద్నూర్ వరకు కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/