కరోనా బారినపడిన సోనియాగాంధీ

దేశ వ్యాప్తంగా కరోనా అదుపులో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. గురువారం వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు.

గతంలో సోనియా గాంధీని కలిసిన చాలా మంది నాయకులు .. కార్యకర్తలు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింద‌న్నారు రణదీప్ సూర్జేవాలా తెలియజేశారు. సోనియా గాంధీకి నిన్న (బుధవారం) సాయంత్రం తేలికపాటి జ్వరం వచ్చింది, ఆ తర్వాత ఆమెకు కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చింది. సోనియా గాంధీ ఐస‌లేష‌న్ లో ఉన్నార‌ని సుర్జేవాలా అన్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. జూన్ 8లోపు సోనియా బాగుంటుందని సూర్జేవాలా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యే ముందు సోనియా కరోనా బారినపడ్డారు. కాగా, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో భాగంగా సోనియా ఈనెల 8వ తేదీన ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కాగా రాహుల్ గాంధీని గురువారం విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే, రాహుల్ తేదీని మార్చాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మే 20 నుంచి 23 వరకు లండన్‌లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి రాలేదు. జూన్ 5 నాటికి అతను భారత్‌కు తిరిగి వస్తార‌ని అంటున్నారు. రాహుల్ వచ్చాక ఈడీ ముందు హాజరు కానున్నారు.