టీడీపీ లో అవమానాలు భరించలేకే తాను బయటకు వచ్చాను – దివ్యవాణి

టీడీపీ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన దివ్యవాణి ..గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ఫై , పార్టీ లోని కొంతమంది నేతలపై పలు వ్యాఖ్యలు చేసింది. పార్టీలో ఎదురవుతున్న అవమానాలు భరించలేకే తాను బయటకు వచ్చానని , ఓ మంచి నాయకుడితో పనిచేయలనే లక్ష్యంతోనే టీడీపీలో చేరానని , కానీ తనకు పార్టీ లో ప్రాధాన్యత ఇవ్వలేదని కన్నీరు పెట్టుకుంది. టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మతమార్పిడుల గురించి మాట్లాటితే తాను ప్రశ్నించానని దివ్యవాణి గుర్తుచేశారు. ఓ వ్యక్తి గురించి వ్యవస్థను ఎలా అంటారని ప్రశ్నించినట్లు తెలిపారు. చంద్రబాబుకు కొందరు రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. డబ్బులిస్తే వచ్చే రిపోర్టులపై ఆధారపడవద్దన్నారు. మత మార్పిడుల విషయంలో తానిచ్చిన సమాచారాన్ని టీడీ జనార్ధన్ వేరొకరికి ఇచ్చి చెరప్పించారన్నారు.

పార్టీలో టీడీ జనార్ధన్ తనకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు. కొంతమంది డబ్బులు తీసుకొని తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీలో మహిళా నేతలు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారిని వేధిస్తునారంటూ దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది బయటపడలేక కుమిలిపోతున్నారని.. పదవుల కోసం వేధిపులు భరిస్తున్నారన్నారామె. గాడ్ ఫాదర్స్ ఉన్న నేతలకే పదవులు, ప్రాధాన్యత దక్కుతున్నాయన్నారు.

కొందరు ఇడియట్స్‌ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా..? ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాలి. నేను చెప్పాల్సిన పాయింట్లు వేరే వాళ్లతో చెప్పించారు. మీటింగుల్లో ఎవరితో మాట్లాడించాలో ముందు అనుకుని మాట్లాడిస్తారు. టీడీ జనార్దన్‌ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నరకం చూపిస్తారా..? పార్టీలో నా స్థానం ఏంటో తెలియని పరిస్థితి ఉంది’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

ముక్కుసూటితనంగా మాట్లాడుతున్నందునే తనను పార్టీలో తొక్కేశారని దివ్యవాణి ఆరోపించారు. టీడీ జనార్ధన్ ను ప్రశ్నించినందుకే తనను అవమానించారన్నారు. ఇక మహానాడులో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని చెప్పారు. మాట్లాడేందుకు అవకాశమివ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు నేతలను అడుక్కున్నా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతానికి టీడీపీ నుంచి బయటకు వచ్చానని.. రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు దివ్యవాణి.