కారిడార్ నిర్మాణ పనులకు కెటిఆర్ శంకుస్థాపన

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ నల్లగొండ క్రాస్‌రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 523.37కోట్ల వ్యయంతో నల్గొండ క్రాస్‌రోడ్స్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవున దీని నిర్మాణం జరగనుంది. ఈ కారిడార్ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా, ఇందులో ఫ్లై ఓవర్ పొడవు 2.580 కిలోమీటర్లు. ఈ ఫ్లై ఓవర్‌పై రెండువైపులా రెండేసి లేన్లలో వాహనాలు ప్రయాణం సాగించవచ్చు. దీనిని 24 నెలల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/