అమిత్ షా రాజీనామా చేయాలి

ఢిలీల్లో అల్లర్లు.. ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా బిజెపి నేతల వ్యాఖ్యలున్నాయి


 Congress President Smt. Sonia Gandhi addresses media at AICC HQ on Delhi Violence

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు. ఈరోజు కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో కలిసి ఆమె ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘ఢిల్లీలోని పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ మంత్రి బాధ్యత వహించాలి. హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. ‘ఈ హింస వెనుక కుట్ర ఉంది. ఇటువంటి ఘటనలనే ఢిల్లీ ఎన్నికల సమయంలోనూ దేశం యావత్తూ చూసింది. ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా, వారిలో భయపూరిత వాతావరణం నెలకొనేలా బిజెపి నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. 72 గంటల్లో 18 మంది మృతి చెందారు. వారిలో హెడ్‌ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ హింస కొనసాగుతోంది’ అని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/