వుహాన్‌లో ఆంక్షలు పాక్షికంగా తొలగింపు

తగ్గుముఖం పడుతున్న కొత్త ఇన్ఫెక్షన్‌లు

coronavirus- Wuhan
Wuhan

బీజింగ్‌: వుహాన్‌ నగరంలో కొత్త ఇన్ఫెక్షన్‌లు తగ్గుముఖం పడుతుండటంతో ఆ నగరంపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం పాక్షికంగా తొలగించింది. నగరంలో ఇన్ఫెక్షన్‌ సోకి ఇంకా నయం కాని వారు ప్రత్యేక చికిత్స కోసం, నగరంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల వారు ఇతర ప్రాంతాలకు బృందాలుగా వెళ్లవచ్చని నగర పాలక యంత్రాంగం ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్ర స్థానంగా మారటంతో గత నెల 23 నుండి వుహాన్‌ నగరంపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించి ఆ నగరాన్ని దిగ్బంధం చేసిన విషయం తెలిసిందే. వుహాన్‌తో పాటు హువై ప్రావిన్స్‌లోని మరో 18 నగరాలను కూడా ప్రభుత్వం దిగ్బంధం చేసింది. ఈ ఇన్ఫెక్షన్‌తో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ నయం చేసుకుని డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/