‘‘ఓ తాతగారూ మీరింకా ఉన్నారా..? అంటూ వీహెచ్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు

రామ్ గోపాల్ వర్మ కు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం వార్తల్లో నిలువడం కొత్తమీ కాదు. నిత్యం ఏదోక అంశంపై కామెంట్స్ చేయడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. తాజాగా నాగార్జున యూనివర్శిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వర్మ హాజరై..పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. దీనిపై యావత్ ప్రజానీకం , రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడామహిళలను ఉద్దేశించి ఆర్జీవీ చేసిన కామెంట్లు సరికాదని మండిపడ్డారు.

ఇప్పటివరకు ఆర్జీవీ కామెంట్లపై సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ స్పందించలేదని… ఇలాగే వదిలేస్తే మహిళలను అవమానించడం అలవాటవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్మకు దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని సవాల్ విసిరారు. నాగార్జున వర్సిటీ వీసీని సస్పెండ్‌ చేసి, ఆర్జీవీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తాజాగా తనపై కామెంట్స్ చేసిన వీహెచ్ ఫై వర్మ సెటైర్లు వేశారు. ‘‘ఓ తాతగారూ మీరింకా ఉన్నారా??? నాసా యాక్ట్ వర్తించదు టాడా యాక్ట్‌ని 1995 లోనే తీసేశారు… ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి… ఒకసారి డాక్టర్‌కి చూపించుకోండి’’ అని ట్విట్టర్ లో ఆర్జీవీ ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఓ వెబ్ సైట్ లో వచ్చిన వీహెచ్ వ్యాఖ్యల కథనాన్ని కూడా వర్మ పంచుకున్నారు.