ఒక్క ఫోటో అని చెప్పి..ఏకంగా హీరోయిన్ భుజం పైనే చేయి వేయబోయాడు

సినీ స్టార్స్ అంటే అందరికి అభిమానమే..ఒక్కసారైనా వారిని దగ్గరి నుండి చూడాలని , ఓ ఫోటో దిగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఒకవేళ ఆలా ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు. అలాంటిది ఓ అభిమానికి ఏకంగా హీరోయిన్ పక్కన ఫోటో దిగే ఛాన్స్ వచ్చింది. అయితే సదరు యువకుడు మాత్రం మరో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అది గమనించిన హీరోయిన్ ఫోటో దిగకుండా జారుకుంది. ఈ ఘటన కేరళలోని ఒక కాలేజ్ లో చోటుచేసుకుంది.

సూర్య హీరో గా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా హీరోయిన్ అపర్ణ బాలమురళి ..ప్రస్తుతం తన్కం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా రిలీజ్ సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కోసం కేరళలోని ఒక కాలేజ్ కి వెళ్ళింది. అక్కడ స్టేజ్ మీద ఉన్న అపర్ణ బాలమురళితో ఫోటో దిగేందుకు ఒక స్టూడెంట్ వచ్చాడు. ఆమె ఫోటోనే కదా అని లేచి నిలుచుంది ఫోటోకి స్టిల్ ఇచ్చిన అతను ఆమె భుజం మీద చేయి వేయాలని ప్రయత్నించాడు. అతను తన మీద చేయి వేస్తున్న విషయం గమనించిన ఆమె వెంటనే తప్పుకుంది. పోనీలే ముచ్చట పడుతున్నారు కదా అని ఫోటో దిగే అవకాశం ఇస్తే అతను చేసిన ఈ పని ఆమెను షాక్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.