తెలంగాణ మంత్రులతో టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్ : తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి కోరారు. గ్రామాల్లో సి.సి రోడ్లు, లింక్ రోడ్లకు నిధులు కేటాయించాలని కోరారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సిఎల్పీ నేత భట్టితోపాటు ఎమ్మెల్యే సీతక్క, శ్రీధర్ బాబులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ను సైతం కాంగ్రెస్ నేతలు నిన్న కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం సీఎల్పీ పక్షాన ఆయన సీఎంకు లేఖ రాశారు. ఈనెల 1 నుంచి 7వ తేదీలోపు వీలున్నప్పుడు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తామని ఆ లేఖలో భట్టి కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/