దశ, దిశ లేని బడ్జెట్ ఇది : సీఎం కెసిఆర్

హైదరాబాద్ : నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన‌ కేంద్ర బ‌డ్జెట్ పై తెలంగాణ సీఎం కెసిఆర్ స్పందించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసిందని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇదో గోల్ మాల్ బ‌డ్జెట్ అన్నారు. ఈ బ‌డ్జెట్ అన్ని వ‌ర్గాల‌ను నిరాశ ప‌రిచింద‌న్నారు. ఇది పసలేని పనికిమాలిన బడ్జెట్ అన్నారు. ఈ బ‌డ్జెట్ దిశా నిర్దేశం లేని బ‌డ్జెట్ అని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. బ‌డ్జెట్ మొత్తం మాట‌ల గార‌డీలా ఉంద‌న్నారు. వ్య‌వ‌సాయ రంగానికి ఈ బ‌డ్జెట్ బిగ్ జీరో అన్నారు. దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం విచిత్ర‌మ‌న్నారు. ప‌న్నుచెల్లింపుదారుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌న్నారు.”దశ-దిశ లేని బడ్జెట్ ఇది. నిరాశ నిస్పృహల బడ్జెట్. పసలేని, పనికిమాలిన బడ్జెట్. అన్ని వర్గాల వారిని నిరాశపర్చింది. కేంద్రమంత్రి ప్రసంగం మొత్తం డొల్ల కేంద్రం విమర్శించారు. జబ్బలు చరుచుకోవడం తప్ప ఏమీ లేదు’ అని కేసీఆర్ అన్నారు

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/