పీఆర్సీ అంశం..అసంపూర్తిగా ముసిగిన చర్చలు

మంత్రుల కమిటీకి అభిప్రాయాలు తెలిపిన పీఆర్సీ సాధన సమితి

హైదరాబాద్ : చర్చలకు రావాలంటూ పీఆర్సీ సాధన సమితికి ఏపీ ప్రభుత్వం లిఖితపూర్వక ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పీఆర్సీ సాధన సమితి… తమ అభిప్రాయాలను మంత్రుల కమిటీకి తెలియజేసింది. డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తేనే చర్చలపై ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. చర్చలపై మంత్రుల కమిటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో, తాము కూడా చర్చించుకుని మళ్లీ వస్తామని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందించింది. సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీ సభ్యులకు సూచించింది. ఈ అంశంపై చర్చించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ నివాసానికి వెళ్లినట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/