మరో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Bomb threats to ten more schools

లక్నో: దేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్స్ వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటు..బాంబు బెదిరింపులు వస్తున్న విషయవం తెలిసిందే. అయితే తాజాగా మరో పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సుమారు పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబులతో పేల్చివేస్తామంటూ ఆ స్కూళ్లకు ఈమెయిల్స్ అందాయి.

కాగా, ఈ విషయం తెలియడంతో జిల్లా యంత్రాంగతం అప్రమత్తమైంది. పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు ఆయా స్కూళ్లకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. విద్యార్థులు, స్కూల్స్‌ సిబ్బందిని ఇళ్లకు పంపివేశారు. రష్యాలోని సర్వర్‌ల ద్వారా ఈమెయిల్స్‌ వచ్చాయని పోలీస్‌ అధికారి తెలిపారు. స్కూళ్లకు బాంబు బెదిరింపులపై సైబర్ సెల్ విభాగం దర్యాప్తు చేస్తున్నదని చెప్పారు.

మరోవైపు మంగళవారం బెంగళూరులోని ఎనిమిది స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. గత వారం కూడా నగరంలోని ప్రముఖ హాస్పిటల్ చైన్ అయిన సెయింట్ ఫిలోమినాకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపు ఈమెయిల్‌ అన్నీ బూటకమని ఆ తర్వాత తేలింది.